ఎప్పుడైనా మనం ఫ్లైట్ లో జర్నీ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని అంటారు. ఎందుకు ఫ్లైట్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి..? ఫోన్ ని ఫ్లైట్ లో వాడటం వల్ల ఏమైనా ప్రమాదం కలుగుతుందా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. విమాన ప్రయాణ సమయం లో అందరూ ఫోన్ ఆఫ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఫోన్ వాడొద్దని స్విచ్ ఆఫ్ చేయమని అంటారు.
ఎందుకు అలా చెయ్యాలి అనే దాని గురించి చూస్తే… మొదట్లో అయితే విమాన ప్రయాణం చేసినప్పుడు మొబైల్ ని వాడడం వల్ల ఫోన్లకి నష్టం కలిగేది. ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పని చేసే అవకాశం విమానంలో ఉండదని ఫోన్ ఉపయోగించవద్దని నిషేధించారు. విమానాలు ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మొబైల్ ఫోన్లో ఇంటర్ ఫెరన్స్ ను తట్టుకుని పని చేస్తాయి. అయితే మొబైల్ సిగ్నళ్లు ఉపయోగించుకొనే బ్యాండ్, వేవ్ స్పెక్ట్రమ్ లు వేరుగా ఉంటాయి మరో పక్క విమాన కమ్యూనికేషన్ చానళ్లు కూడా వేరుగా ఉంటాయి.
అయితే మొబైల్ ఫోన్ ని విమానం లో ఉపయోగించడం వల్ల ఏ విమానం కి కూడా ప్రమాదానికి కలగ లేదు అలానే మొబైల్ ఫోన్లు విమానంలో వాడటం వల్ల ఎలక్ట్రానిక్ వ్యవస్థకు నష్టం లేదు. కానీ పైలెట్లు ఏటీసీ తో మాట్లాడే సమయంలో నాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మనం విమానం లో ప్రయాణించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ని ఉపయోగించ వద్దు అని అంటారు.