మస్ట్ రీడ్: చంద్రబాబు తొడకొడితే సౌడ్ వస్తుందా?

-

మస్ట్ రీడ్: చంద్రబాబు తొడకొడితే సౌడ్ వస్తుందా?2014 ఎన్నికల తర్వాత వైకాపా నేతలను, జగన్ ను చంద్రబాబు & కో అసెంబ్లీలో ట్రీట్ చేసిన విధానం అంతా ఇంతా కాదు! ఆ సమయంలో వారికి చూపించిన నరకం సామాన్యులను కూడా కదిలించిన సంగతి తెలిసిందే. మహిళా ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీ గేటువద్ద రోడ్లపై కూర్చునే పరిస్థితి కూడా కల్పించారు! ఆ సంగతులు అలా ఉంటే.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి! మరి ఇప్పుడు బాబు ఏమి చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది!

నాడు అసెంబ్లీలో బాబు విన్యాశాలు చూసి, వేదింపులు భరించి భరించిన జగన్… తన ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రులుగా చేసిన చంద్రబాబు సీఎం గా ఉండగా అసెంబ్లీకి వచ్చేది లేదని గట్టిగా ప్రతిన పూని.. బంపర్ మెజారిటీతో సీఎంగా తిరిగి అసెంబ్లీకి వచ్చారు. చరిత్రలో గుర్తుండే ఛాజెంజ్ ఇది! అప్పుడు జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రజలు కూడా స్వాగతించారు అంటే.. అప్పుడు సభలో టీడీపీ నేతల ప్రవర్తన ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు!

అయితే… నాడు టీడీపీ నేతలు జగన్ పై విషయం కంటే ఎక్కువగా వ్యక్తిగత దాడులకే ప్రాధాన్యం ఇచ్చేవారు! అయితే… జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కానీ వైకాపా నేతలు కానీ చంద్రబాబుపై వ్యక్తిగతంగా కాకుండా… సబ్జెక్ట్ బేస్డ్ దాడి చేస్తున్నారు. బాబు గతంలో మాట్లాడిన మాటలు, నేడు యూ టర్న్ తీసుకున్న అంశాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తూ… బాబు గొంతు ఎండిపోయేలా చేస్తున్నారు!

దీంతో బాబు అసెంబ్లీలో ఇరుకునపడిపోతున్నారు! ఇదే సమయంలో బాబుతో విభేదించిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు… తమను బాబు బ్యాచ్ తో కాకుండా సెపరేట్ గా కూర్చోబెట్టాలని స్పీకర్ ను విన్నవించడం.. వారు కూడా మరో రకం ప్రతిపక్షంగా మారడం అనేది బాబుకు మింగుడుపడటం లేదు! ఇదే క్రమంలో.. నేడో రేపో బాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయి… కేవలం కుప్పం ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టే పరిషితులు కనిపిస్తున్నాయి!

దీంతో ఈ రేంజ్ మానసిక దాడులు, రాజకీయ దెబ్బలు ఈ వయసులో భరించడం తనవల్ల కావడం లేదని భావిస్తోన్న బాబు.. ఇకపై అసెంబ్లీకి రారనే కథనాలు మొదలైపోయాయి! బాబుకు తోడుగా ప్రస్తుతం 18 – 19 మంది ఉన్నప్పటికీ వారిలో విషయపరిజ్ఞానం ఉన్నవారు పెద్దగా లేకపోవడం… ఉన్న అచ్చెన్న నోరేసుకుని మాత్రమే పడిపోవడం జరుగుతుండేది! ఇదే సమయంలో అచ్చెన్న ప్రస్తుతం అవినీతి కేసులో అరెస్టయ్యి బెయిల్ పై ఉండటంతో… గతంలో దూకుడు ఇప్పుడు ఉండకపోవచ్చని బాబు భావిస్తున్నారంట!

దీంతో… 1993 టైంలో నందమూరి తారక రామారావు, 2014 లో జగన్ లు శపథం చేసి అనంతరం ముఖ్యమంత్రులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినట్లుగా… తాను కూడా ఈ మూడేళ్లూ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని కాసేపు శపథం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారంట!! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ అయినా, జగన్ అయినా శపథం చేసి జనాల్లో తిరిగారు.. ఊహించినదానికంటే ఘనంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు!

మరి చంద్రబాబు కూడా ఆ రేంజ్ లో ఎన్టీఆర్, జగన్ ల సరసన నిలబడగలుగుతారా? ఆ రేంజ్ లో ఈ మూడన్నరేళ్ల్లూ జనాల్లో ఉండగలుగుతారా? అసెంబ్లీలోకి వెళ్లకపోయినా కూడా ప్రజాసమస్యలను ప్రజల దృష్టికి ఆ రేంజ్ లో తీసుకెళ్లగలుగుతారా అన్నది వేచి చూడాలి!! అలా కానిపక్షంలో… ఇక అసెంబ్లీకి రావడం బాబు మానడం కాదు… ఆ అవసరం కానీ అవకాశం కానీ ప్రజలు కల్పించకపోవచ్చు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version