బండి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా : మంత్రి పొన్నం

-

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజంగా హిందువులు అయితే బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ బహిరంగంగా మాట్లాడుతున్నారని, దీనిపై ఎలక్షన్ కమిషన్ మౌనం ఎందుకు వహిస్తుందో చెప్పాలన్నారు.

బండి సంజయ్ మీద ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందుత్వవాదులు బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి బ్యానర్లు కట్టడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ,బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని అనుకున్నాయని.. మెజార్టీ రాదని తెలిసి బీఆర్ఎస్ తప్పుకుందని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news