రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

-

షర్బత్​ జిహాద్​ అంటూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు అంతర్మాత్మను షాక్​కు గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్​దేవ్​ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్​కు వ్యతిరేకంగా హమ్​దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

ఏం జరిగిందంటే..

 పతంజలి గులాబ్ షర్బత్​ను ప్రమోట్​ చేస్తూ బాబా రాందేవ్ ఏప్రిల్ 3వ తేదీన ఓ వీడియో రిలీజ్ చేశారు.   అందులో హమ్‌దార్ద్‌ షర్బత్‌ గురించి పరోక్షంగా ఆరోపించారు. ఓ కంపెనీ షర్బత్ అమ్ముతుంది కానీ దాని ద్వారా సంపాదించిన డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి వినియోగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పతంజలి తయారు చేసే గులాబ్ షర్బత్ తాగితే గురుకులాలు, ఆచార్యకులం, పతంజలి యూనివర్సిటీ నిర్మాణాలు, భారతీయ విద్యా మండలి అభివృద్ధి జరుగుతుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. షర్బత్​ జిహాద్​ పేరుతో రాందేవ్​ బాబా వీడియో రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news