ప్రపంచ నేతలను కడిగి పారేసిన పిల్లకు నోబెల్ ..?

-

గ్రెటా థెన్బర్గ్.. ఈ బాలిక ఓ సంచలనం.. “ఒట్టి మాటలతో నా స్వప్నాలను, బాల్యాన్ని హరించిన మీ కెంతధైర్యం?” అంటూ ప్రపంచ దేశాల నేతలనే ఆమె నిలదీసిన తీరు ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది. వాతావరణ మార్పులపై ఉద్యమించిన ఈ చిన్నారి ఇప్పుడు మరోసారి వార్తల్లో సంచనలం సృష్టించే అవకాశం ఉంది.

ఈ చిన్నారి గ్రెటా థెన్బర్గ్ కు ‘నోబెల్ శాంతి’ లభించవచ్చన్న అభిప్రాయాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాహోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాన్ స్మిత్ థెన్బర్గ్ ను ‘నోబెల్ శాంతి’కి పరిగణించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పిల్లకు నోబెల్ వస్తుదా రాదా అన్న విషయంపై ఆన్ లైన్ లో బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.

క్లైమేట్ ఛేంజ్ పై గత ఏడాది గ్రెటా స్వీడన్ పార్లమెంట్ ముందు ప్రతి శుక్రవారం ఆందోళన ప్రారంభించింది. ‘ స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్ ‘ అని రాసి ఉన్న సైన్ బోర్డు పట్టుకుని తన ఉద్యమానికి నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన ఈ అమ్మాయి కొద్దికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది యువతను ఆకట్టుకోగలిగింది. గ్రెటా ఆందోళనకు పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు పలికారు.

లాడ్ బ్రోక్స్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఇప్పుడు థెన్ బర్గ్ కు నోబెల్ శాంతి వస్తుందంని అంచనా వేస్తున్నాయి. ఈ చిన్నారి ధీరవనిత థెన్ బర్గ్ ఇప్పటికే ప్రతిష్టాత్మక ‘రైట్ లైవ్లీహుడ్ అవార్డు’ను అందుకుంది కూడా. గ్రెటా మాత్రం ఈ అవార్డు తనకు వస్తే అది తాను లాంచ్ చేసిన ఉద్యమానికి గుర్తింపునిచ్చినట్టే అని పేర్కొంది. తాము ఇలాంటి అవార్డులకోసం ఉద్యమం చేయడంలేదని గ్రెటాతో బాటు ఆమె ఫ్రెండ్స్ కూడా నిక్కచ్చిగా చెబుతున్నారు.

అయితే కొందరి మాత్రం అబ్బే ఆ అవకాశం లేదని అంటున్నారు. ఏమైనా ఈ 16 ఏళ్ళ బాలికకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే అది అంతర్జాతీయంగా బాలల ప్రపంచానికి గర్వకారణమే.. చూడాలి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version