ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ.6వేలతో కలిపి రూ.12వేలు రైతులకు అందించనున్నారు. అయితే ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.