గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవాలని అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైం లో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా లాభాలని పొందచ్చని పిల్లలు తెల్లగా పుడతారని అంటూ ఉంటారు. కుంకుమ పువ్వు ని ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు అసలు తీసుకోకూడదు. ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వలన గర్భాశయ కండరాల కదలిక బాగా పెరుగుతుంది మొదటి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది కనుక తీసుకోకూడదు.
నాలుగో నెల నుండి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు సుఖ ప్రసవానికి ఇది సహాయపడుతుంది. అయితే కుంకుమ పువ్వు తీసుకోవచ్చు కదా అని బాగా అధిక మోతాదులో తీసుకుంటే సమస్య కలుగుతుంది. లిమిట్ గానే తీసుకోవాలి. రోజుకి 0.5 నుండి రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ మోతానికి మించి తీసుకుంటే సమస్యలు కలుగుతాయి కేవలం చిటికెడు కుంకుమ పువ్వుని మాత్రమే తీసుకోవాలి. కుంకుమపువ్వు తీసుకోవడం వలన మూడ్ స్వింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది.
కాళ్లల్లో, పొత్తికడుపులో వచ్చే నొప్పులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆందోళన కూడా కలగకుండా మంచి నిద్ర పడుతుంది. ఇక బిడ్డ రంగు మారుతుందా అనేది చూస్తే.. పుట్టబోయే బిడ్డ రంగు పూర్తిగా జన్యులపై ఆధారపడి ఉంటుంది కుంకుమపువ్వు తీసుకుంటే బిడ్డ కలర్ పై ఎలాంటి ప్రభావం పడదు. ఇన్ని లాభాలు ఉంటాయి కనుక కుంకుమ పువ్వు ని తీసుకోమని అంటుంటారు. పాలల్లో పంచదారతో పాటుగా కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని తీసుకుంటే ఈ ప్రయోజనాలను పొందొచ్చు.