ప్రజల తరఫున ప్రశ్నిస్తే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.బుధవారం ఉదయం నరేందర్ రెడ్డి భార్యను సబితా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి రైతుల కోసం పోరాటం చేశారని, బీఆర్ఎస్ నేతలకు అరెస్టులు కొత్తేం కాదన్నారు. జిల్లా అధికారులపై జరిగిన దాడి బాధాకరమన్నారు.
లగచర్లలో నరేందర్ రెడ్డి చేసిన తప్పేంటన్ని ప్రశ్నించారు.ఫార్మా నిర్వాసితులకు భరోసా ఇవ్వకుండావ నరేందర్ రెడ్డిని బాధ్యుడిని చేస్తున్నారని సబిత సీరియస్అయ్యారు.భూములు పోతున్న రైతులకు నరేందర్ రెడ్డి అండగా నిలిచారని, రైతుల తరపున నిలబడటం నరేందర్ హక్కు అని చెప్పారు.రేవంత్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే పట్నం నరేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నేతలు, కార్యకర్తలు ఫోన్ చేస్తే పెద్ద లీడర్లు మాట్లాడతారన్నారు. ఫోన్ మాట్లాడితే అందులో కుట్ర ఏముందని సబిత ప్రశ్నించారు.