విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. మెట్రో పాలసీ ప్రకారం మెట్రో రైల్ కార్పొరేషన్ కు అప్లై చేసారని… మెట్రో రైల్ టెండర్లు గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విశాఖ మెట్రో రైలు ఆగిపోయిందని వెల్లడించారు. 76.9 కిలోమీటర్ల 4 కారిడార్ కోసం మూడేళ్ళ తరువాత గత ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చిందన్నారు. కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆగ్రహించారు మంత్రి పొంగూరు నారాయణ.
రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి రాసామని తెలిపారు. 11,491 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. ఎండాడ, మద్దిలపాలెం, హనుమంతవాక, స్టీల్ ప్లాంట్ ల వద్ద క్రాసింగ్ ల నిర్మాణం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఇక అటు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పై మండలిసభలో చర్చించాలని వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది.