ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ పై దాడులు జరుగుతున్నాయనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సజ్జల రామ కృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ పై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదు అన్నారు. ఎన్నికలు వచ్చాయని ఎవరైనా కావాలని దాడి చేయించుకుంటారా..? పవన్ కళ్యాణ్ కత్తితో పొడిపించుకోవడం, రాయితో కొట్టించుకోవడం చేస్తారా..? ఓ సారి ఆయన తన అభిమానితో కొట్టించుకోవచ్చు కదా..? దాడి చేసిన నిందితులను బయటపెట్టాలనేది మా డిమాండ్ అని వెల్లడించారు.
సీఎం పై దాడి జరిగితే ప్రతిపక్షాలు అన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మరోవైపు నింద తమపైకి వస్తోందని.. టీడీపీ భయపడుతోంది. ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు అవుతుందని వాళ్ల భయం అని.. పుట్టగతులుండవని ప్రతిపక్షాలకు అర్థమైందన్నారు సజ్జల. సీఎం జగన్ పై జరిగిన దాడిని టీడీపీ భద్రతా వైఫల్యం అని పేర్కొంటున్నారు. టీడీపీ నేతలు ఏమంటున్నారో వారికే అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల.