రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.2.10 కోట్లు చెల్లించారు : జీవీ రెడ్డి

-

ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాలా అంచున ఉన్నదని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ దర్శకుడు, రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు అక్రమంగా రూ.2.10 కోట్లు చెల్లించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా 2016లోొ సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభించారని తెలిపారు. 2019 నాటికి 24వేల కిలోమీటర్ల మేరకు కేబుల్ వేసి 10లక్షల కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.

నేడు ఆ సంఖ్య దాదాపు 5 లక్షలకు పడిపోయిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతి పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురి చేసింది. అప్పటి ఎంపీ మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక దస్త్రాలు మార్చేశారు. కీలక డాక్యుమెంట్లను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని తెలిపారు. వ్యూహం మూవీని ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి చెల్లింపులు చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version