ఎన్నికల వేళ.. కాంగ్రెస్ లోకి ఏపూరి సోమన్న..!

-

ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజుగా ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న టీఆర్ఎస్ కు షాకిచ్చారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. హైదరాబాద్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేసిన ఏపూరి సోమన్న తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత షర్మిల రాకతో వైఎస్సార్ టీపీలో చేరారు. అక్కడ విభేదించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి
సొంత గూటికి చేరిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version