ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో బిల్లుని ఆమోదింపజేసిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బిల్లు విషయంలో పట్టుదలగా వ్యవహరించారు. దీనితో సభలో బిల్లు ఆమోదం పొందింది. ఇక ఇదిలా ఉంటే ఈ బిల్లు నేడు శాసన మండలికి వెళ్తున్న నేపధ్యంలో ఎం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.
మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ముందుకి వెళ్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మండలిలో ఎలా అయినా సరే వికేంద్రీకరణపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుంది. దీనితో ఎమ్మెల్సీలు అందరూ కూడా సభకు వెళ్ళే విధంగా చంద్రబాబు ఆదేశాలు జారి చేసారు. ఇక సభలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మంత్రులు అందరూ,
సభకు హాజరు కావాలని జగన్ ఆదేశించారు. బిల్లుని అడ్డుకోవాలని తెలుగుదేశం భావిస్తుంది. బిల్లుని సెలెక్ట్ కమిటికి పంపే ఆలోచనలో తెలుగుదేశం ఉంది. దీనితో బిల్లు పెండింగ్ లో ఉండే ఉండే విధంగా చంద్రబాబు వ్యూహం సిద్దం చేసారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సరే బిల్లుని ఆమోదించాలి అని భావిస్తుంది. ఆర్డినెన్స్ కి వెళ్తే మాత్రం గవర్నర్ అనుమతి తప్పనిసరి.
సెలెక్ట్ కమిటీకి వెళ్తే రెండు నెలల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఆర్డినెన్స్ తీసుకొస్తే మాత్రం గవర్నర్ దగ్గరకు వెళ్తుంది. ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన దాన్ని కేంద్రం పరిశీలనకు పంపింతే అక్కడ కూడా ఆలస్యం కానుంది. దీనిపై కోర్ట్ లో పిటీషన్లు వేసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆరు నెలల్లోగా దాన్ని ఆమోదించుకోవాల్సి ఉంటుంది.