పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తా: యూసఫ్ పఠాన్

-

వెస్ట్ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. అందులో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ తో పాటు ప్రస్తుత ఎంపీ మహువా మొయిత్రా సహా నురుల్ ఇష్లాంకు, కీర్తి ఆజాద్, శత్రుజ్ఞ సిన్హా వంటి తదితర పేర్లు ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని సీఎం స్పష్టం చేశారు రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలలోను టిఎంసి అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.’మమతా బెనర్జీ నన్ను టీఎంసీ కుటుంబంలోకి ఆహ్వానించారు. పార్లమెంటులో ప్రజల గొంతుకగా మారుతానని హామీ ఇచ్చారు.నాపై విశ్వాసం ఉంచినందుకు ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను. ప్రజా ప్రతినిధులుగా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తాను’ అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version