లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో రెండు మ్యాచ్‌లపై విచారణ జరుగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్ మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. అధిక బెట్టింగ్ నమూనాలను గుర్తించిన అధికారులు ఆ రెండు మ్యాచులపై విచారణ జరుపుతున్నారు. కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఈ మ్యాచ్‌లపై జరిగిన బెట్టింగ్‌లపై సందేహాలు వ్యక్తం చేశాయి.
మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఈ అనుమానాస్పద లిస్టులో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరేట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాత రెండో సెట్‌ను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లెయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలున్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ నడిచినట్లు తేలింది. కచ్చితంగా ఫలితం కూడా అలాగే వచ్చింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ కేమ్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. ఈ రెండు మ్యాచులపై ఐటఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది.