హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. జంట నగరాల్లో హోలీ పండుగ జోష్ ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హోలీ సెలబ్రేషన్స్ ను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట చర్యలకు రెడీ అయ్యారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదు అన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్ చేయాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగానే మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ పేర్కొన్నారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకొని వైన్స్ షాప్ లను క్లోజ్ చేయాలని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.