ముగిసిన పోలింగ్.. డ్యూటీ ఎక్కిన మందుబాబులు

-

హోరాహోరీగా సాగిన గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ అంకం ముగిసింది. ఇక కేవలం ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. గతంలో కంటే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సహా అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఓటు వేయడానికి రాని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డెక్కారు. దానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా ప్రస్తావించ క్కర్లేదు. ఎన్నికల సందర్భంగా ప్రచారం ముగిసే సమయానికి వైన్స్ ని మూసివేయాలని అబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు రోజుల పాటు మందు షాపులు పూర్తిగా మూసివేయించారు.

అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే 6 గంటలకు wines తెరుచుకోవచ్చని ప్రకటించడంతో వ్యాపారులు ఒక నిమిషం కూడా దాటకుండా షాపులు తెరిచారు. దీంతో మందు బాబులు డ్యూటీ ఎక్కేశారు. ఈ ఉదయం ఓట్లేశారో లేదో తెలియదు గాని మందు కోసం మాత్రం షాపుల ముందు బారులు తీరారు.. కొన్ని చోట్ల తొక్కిసలాటలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మందు మీద పెట్టిన శ్రద్ధ కాస్త ఓటింగ్ మీద కూడా పెట్టి ఉంటే ఇంత దారుణమైన పోలింగ్ శాతం నమోదు ఇది కాదని అంటున్నారు విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version