మందుబాబులకు గమనిక.. షాపులు బంద్ !

-

మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. అయితే అది హైదరాబాద్ లో ఉన్న మందుబాబులకు మాత్రమేనండోయ్. విషయం ఏమిటంటే హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు వచ్చే నెల ఒకటో తారీకున జరగనున్నాయి. ఈ క్రమంలో మద్యం షాపులు మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అయితే అది ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు నుంచి మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 

29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 1 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా ఈ మందు షాపులు మూసివేయనున్నారు. ఒకటో తారీకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయిన ఉండగా 6 గంటల నుంచి షాపులు తెరిచుకో వచ్చని అబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు తెరిచి ఉంటే భారీ ఎత్తున వాటి ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version