ఢిల్లీ పర్యటన.. ఏమీ తేల్చకుండానే వెనుదిరిగిన పవన్

-

తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి నిర్ణయించేందుకు  కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్ పెర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అమరావతి, పోలవరం పై చర్చించామని అన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలు పటిష్టంగా, సమిష్టిగా పని చేయాలనే దానిపై చర్చించుకున్నామని ఆయన అన్నారు.

జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చామన్న పవన్ అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇరు పార్టీల మధ్య సమన్వయ అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టే అంశంపై ప్రత్యేక చర్చ జరిగిందని అభ్యర్థి ఎవరు అనేది త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమే కాని పార్టీలకు లబ్ధి చేకూర్చడానికి కాదని నడ్డా చెప్పారని అన్నారు. అమరావతిలో చివరి రైతు వరకూ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని  రైతుకు న్యాయం జరగడం అంటే అమరావతి రాజధాని గా కొనసాగాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version