మరొక్క రోజుతో 2020 పూర్తవనుంది. 2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీన మందుబాబులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సంవత్సర వేడుకలకి అనుమతినివ్వని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 31వ తేదీన రాష్ట్రంలోని బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని పెంచింది. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మందుషాపులకి అర్థరాత్రి 12గంటల వరకి ఓపెన్ ఉంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఈ సమాచారం అన్ని వైన్స్ షాపుల వారికి అందిందని తెలుస్తుంది.
బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరిచే ఉంటాయట. డిసెంబరు 31వ తేదీన ఉండే అడ్వాంటేజీని ఉపయోగించుకుందామన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు సన్నద్ధమవుతున్నాయి. మహమ్మారి కారణంగా చాలా చోట్ల ఎలాంటి వేడుకలకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ లోనూ న్యూ ఇయర్ సెలెబ్రేషన్ పై నిషేధం విధించారు.