హైదారాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో జరగనుంది. ఈ షో తో ఆకాశంలో దూసుకేళ్లే.. పలు రకాల విమానాలు భూమిపై ప్రదర్శనకు ఉండనున్నాయి. ఈ కార్యక్రమం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. కాగ నేడు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నేడు ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను ప్రారంభించనున్నారు.
కాగ గతంలో కూడా కొన్ని సార్లు ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో హైదరాబాద్ లోనే నిర్వహించారు. కాగ గత ఏడాది కూడా ఈ షోను హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులోనే నిర్వహించారు. అయితే కరోనా కారణంగా షోను కేవలం బిజినెస్ మీట్ గానే నిర్వహించారు. కాగ ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రాండ్ గా చేస్తున్నారు. కాగ ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో ద్వారా నేడు హైదరాబాద్ కు అనేక దేశాల నుంచి విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. ఇక్కడే బిజినెస్ ఒప్పందాలు, పెట్టుబుడులు, పాలసీల తీర్మానాలు జరగనున్నాయి.