ఇంటర్‌ అర్హతతో.. 200 ఉద్యోగాలు..రూ.63,200 జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా వున్నాయి. అందుకే ఒక నోటిఫికేషన్‌ ని రిలీజ్ చేసారు.

తాజా నోటిఫికేషన్‌ ద్వారా 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉంటే ఆన్‌ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 20 లోగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2తో పాటు ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే… అభ్యర్థుల వయసు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.19,900- రూ.63,200 ఉంటుంది. ఈ పోస్టుల కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇక ఫీజు విషయానికి వస్తే.. యూఆర్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600; దివ్యాంగులకు ఫీజు లో మినహాయింపు వుంది. ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో దరఖాస్తు సవరణ. పూర్తి వివరాలని http://www.ignou.ac.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version