రోజూ వీటిని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఉండదు..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ తో సతమతమవుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తీసుకొనే డైట్ లో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు. మరి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

 

బ్రోకలీని తీసుకోవడం వలన క్యాన్సర్ రిస్క్ ఉండదు. బ్రోకలీలో చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి. శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా బ్రోకలీలో ఉంటాయి. క్యాన్సర్ కణాల పరిణామాన్ని 75% వరకు బ్రోకలీ తగ్గిస్తుంది. టమాటాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఇందులో లైకోపీన్ ఉంటుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా టమాటాలో ఉంటాయి. లైకోపీన్ ఎక్కువ తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. కణాల పెరుగుదలని లైకోపీన్ నిలిపివేస్తుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదం ఉండదు.

వెల్లుల్లి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కనుక తప్పకుండా వెల్లుల్లిని తరచూ వంటలు వేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఆహారంలో రెండు నుండి ఐదు గ్రాములు తాజా వెల్లుల్లి చేర్చుకుంటే ఆరోగ్యం మరింత పెరుగుతుంది. బీన్స్ కూడా క్యాన్సర్ ప్రమాదం నుండి బయట పడేస్తాయి. ఫైబర్ ప్రోటీన్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి. బచ్చలి కూర క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. బచ్చలి కూర లో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎక్కువ ఉంటాయి ఇలా వీటిని డైట్ లో చేర్చుకుంటే క్యాన్సర్ ప్రమాదం లేకుండా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version