బీజేపీ సాయంతోనే రేవంత్ రెడ్డి ఇలా.. జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ హరితహారం చేస్తే.. కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోందని, బీజేపీ సాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. సోషల్ మీడియా, మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు.

విద్యార్థులు, యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్తితి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీ ఛార్జీలు అని.. మంత్రులు అక్కసు వెళ్లగక్కి విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ బ్యాచ్ సీఎం, మంత్రులు అని, విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసుు లాఠీ చార్జీలు భరిస్తారా..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version