హైదరాబాద్ శివార్లలో బర్డ్ ప్లూ కలకలం

-

రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వ్యాధి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తొలుత ఏపీలో వ్యాపించిన ఈ ప్లూ.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ప్లూ వైరస్ నిర్ధారణ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ప్లూ నిర్ధారణ కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. గత నాలుగు రోజులుగా అక్కడి ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో వేల కోళ్లు చనిపోగా.. అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కి పంపించారు. 

పౌల్ట్రీలో పని చేస్తున్న వారందరి శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు. ఈ వార్త బయటికి రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణికి పోతున్నారు. ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, దోతిగూడెంలోని 3 పౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ప్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆయా ఫామ్స్ లో ఉన్న కోళ్లను జాగ్రత్తగా పూడ్చి పెట్టించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version