కేసీఆర్ లో సంతోషం పెరిగితే కష్టమే…?

-

తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పుడు మరింత బలంగా కనపడుతున్నారు. ఉప ఎన్నికల్లో అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ లో సంతోషం పెరిగింది. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలకు మరింత బలోపేతం కావాలి అంటూ సూచనలు సలహాలు ఇస్తున్నారు.

అయితే సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే విషయం లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు కోరుతున్నా ఆయన పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి బలంగా ఉన్నారు. ఆర్ధికంగా కూడా బలమైన నేత కాబట్టి నాగార్జునసాగర్ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.

ఇక ప్రజల్లోకి తాను వెళ్లకపోయినా పార్టీ నేతలు పార్టీని ముందుకు నడిపిస్తారు అనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్ కొంతమంది తో మాట్లాడే విషయంలో కూడా సమర్థవంతంగా అడుగులు వేయలేకపోతున్నారు. ఇదే కొనసాగితే నాగార్జునసాగర్ ఎన్నికల్లో బీజేపీ లేకపోతే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేశారు కాబట్టి సీఎం కేసీఆర్ కు కాస్త ప్రచారం చేసే భారం తగ్గింది. ఉప ఎన్నికల్లో ఎలా ఉండకపోవచ్చు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version