నిండు గర్భిణిని 8 గంటలు జట్కాలో లాక్కెళ్లి ఆస్పత్రిలో చేర్చిన మహిళ!

-

పర్వత ప్రాంతాల్లోని వేల గ్రామాల దుస్థితికి అద్దంపట్టే మరో ఘటన హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం, కులూలో చోటుచేసుకంది. ప్రసవ వేదన అనుభవిస్తున్న నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడం కోసం ఓ మహిళ ఆమెను కొండలు, గుట్టల మీదుగా 8 గంటలపాటు జట్కాలాంటి బండిలో లాక్కెళ్లింది. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఘటన కలచివేసింది.

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం, కులూ ప్రాంతంలోని శక్తి గ్రామానికి చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. సడన్‌గా పురిటినొప్పులు రావడంతో ఆ కుటుంబానికి చెందిన మరో మహిళ ఆమెను జట్కాలాంటి లాగుడు బండిలో వేసుకుని.. కొండలు, గుట్టల మీదుగా 8 కిలోమీటర్లు తీసుకెళ్లి, ఆస్పత్రిలో చేర్చింది. తమ గ్రామానికి ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంవల్లే తాను ఇంత యాతన అనుభవించాల్సి వచ్చిందని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక శక్తి గ్రామమే కాదు, పర్వత ప్రాంతాల్లోని ఇంకా చాలా గ్రామాల్లో ఇలాంటి దుస్థితి ఉంది. సరైన సౌకర్యాలు, కనీస వైద్య సదుపాయాలు లేక ఆయా గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి నరకయాతనలు అనుభవిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు సరైన రవాణా, వైద్య సౌకర్యాలు కల్పించాలని ఇలాంటి కొండ ప్రాంతాల ప్రజలు నేతలకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version