ఈ దానాలు తప్పక చేయండి..!

-

పూర్వ జన్మలో మనం చేసిన దాన ధర్మాలు ఫలితమే ఈ జన్మ అనేది చాలా మంది విశ్వాసం.
ఈ జన్మ లో చేసిన దాన ధర్మాలు వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడతాయి అనే మాటలు మనం వింటూ ఉంటాము. అయితే, శాస్త్రాలు,పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి.

ఈ కారణంగానే చాలా మంది గుడిలో దైవ దర్శనం చేసుకున్న తరువాత గుడి దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా బియ్యం, డబ్బులు, పళ్ళు, వస్త్రాలు ఇలా దానధర్మాలు చేస్తుంటారు. అయితే పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం
ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంమనకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు.

కానీ, ఏదైనా దానం గా ఇవ్వడానికి వీలు లేదు. దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి
కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం 10 దానాలు:

దూడతో కూడుకున్న ఆవు: ఇదే గోదానం,
భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…
ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version