100కిమీ వేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టిన కారు.. మహిళ మృతి

-

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్యం మత్తులో ఓ యువకుడు 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి స్నూటీ, ఇతర బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీ నడిపిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

కాగా, కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు. ప్రమాదం అనంతరం కారు నుంచి బయటకు దిగిన సదరు యువకుడు గట్టిగట్టిగా అరిచాడు. ప్రమాదం చేసిన సమయంలో ఆ యువకుడి వెంట అతని ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ ఓ అమ్మాయి కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది. ప్రమాదం చేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ది చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news