మీ అత్తగారికి ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే మీరు చిక్కుల్లో పడినట్టే..!

-

భార్య భర్తలు జీవితంలో ఆనందంగా ఉండాలంటే కేవలం వారి మధ్య అనుబంధం బాగుంటే సరిపోదు, అత్త కోడళ్ళ మధ్య కూడా మంచి బంధం ఉండాలి. దానివలన ఎంతో ఆనందంగా జీవించవచ్చు. అయితే అత్త కోడలు మధ్య అనుబంధానికి ఇద్దరూ సరైన విధంగా వ్యవహరించాలి. కానీ కొన్ని సందర్భాలలో అత్తగారి విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. దానివలన ఇంట్లో ప్రశాంతత ఉండదు మరియు భార్యాభర్తల సంబంధం పై ప్రభావం చూపుతాయి. పైగా ప్రతి చిన్న విషయానికి గొడవలు తలెత్తుతాయి. కనుక అత్తా కోడలు మధ్య బంధం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎప్పుడైతే అత్తగారి ప్రవర్తన బాగుంటుందో కోడలి ప్రవర్తన కూడా సరైన విధంగా ఉంటుంది. అత్తగారి ప్రవర్తన మరియు వ్యక్తిత్వం సరైన విధంగా ఉండకపోతే కేవలం అత్తా కోడలి బంధం మాత్రమే కాకుండా భార్య భర్తలు మధ్య ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాలలో కోడలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్తగారు తీరు మార్చుకోరు. దీనివలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న విషయాలకే మహిళలు ఎంతో పెద్ద సమస్యలుగా భావిస్తారు. అందువలన అత్తా కోడలు మధ్య గొడవలు ఏర్పడినప్పుడు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటారు.

అదేవిధంగా అత్తగారి మాట మాత్రమే నెగ్గాలని ఆశిస్తారు. అటువంటి సమయంలో కోడలు మాట వినకపోతే ప్రవర్తనలో ఎన్నో మార్పులు వస్తాయి మరియు గొడవలు ఎక్కువ అవుతాయి. పైగా ఇటువంటి తప్పులు అత్తగారికి తెలిసిన సరే మారడానికి అస్సలు ఇష్టపడరు. దీంతో కోడలికి స్వేచ్ఛ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో, పనులు పూర్తి చెయ్యడం కూడా కష్టమవుతుంది మరియు ఏ విధమైన సహాయం కూడా అందించరు. దీంతో బాధ్యతలు పెరుగుతాయి. కాకపోతే ఇదే పరిస్థితి కూతురికి ఏర్పడినప్పుడు పూర్తి మద్దతును అందిస్తారు. ఇలాంటి సందర్భాలలో కోడళ్ళు మరింత బాధపడతారు. ఈ విధంగా కోడలు మరియు అత్తగారి మధ్య సంబంధం పూర్తిగా తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news