ఇంట్లోనే ప్రత్యేక కిచెన్‌.. మీల్స్‌ డెలివరీ చేస్తూ నెలకు రూ.70వేలు సంపాదిస్తున్న మహిళ..

-

చేతిలో విద్య ఉండాలే గానీ ఎవరి పైరవీ అక్కర్లేదు. మనం చేసే పనిలో స్కిల్‌ ఉంటే మనల్ని ఎదుటి వారు ఆటోమేటిగ్గా మెచ్చుకుంటారు. తరువాత వారు మన దగ్గరికే వస్తారు. అవును.. సరిగ్గా ఈ విషయాన్ని నమ్మింది కాబట్టే ఆ మహిళ ఇంట్లోనే ప్రత్యేక కిచెన్‌ నిర్వహిస్తూ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. ఆమే.. ముంబైకి చెందిన మీనా సుబ్రమణియన్‌.

మీనాది తమిళనాడులోని తిరునల్వేలి. ముంబైలో ఉంటోంది. గత రెండేళ్ల కిందట తన బంధులందరి కోసం ఆమె ప్రత్యేక వంటకాలు చేసింది. దీంతో వారికి ఆ వంటలు ఎంతో నచ్చాయి. వారు ఆమెను సొంతంగా కిచెన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఆమె పెరిమాస్‌ కిచెన్‌ను ప్రారంభించింది. ఆ కిచెన్‌ ద్వారా వంటలు వండుతూ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ మీల్స్, ఇతర వంటకాలను డెలివరీ చేస్తోంది.

మీనా వండే మీల్స్‌ ఎంత రుచికరంగా ఉంటుందంటే ఆమె ప్రతి సోమవారం తన మీల్స్‌లో ప్రత్యేక వంటలను అందిస్తుంది. ఇక ఆ వంటల్లో ఉపయోగించే పోపు, మసాలా దినుసులను ఆమె తమిళనాడు నుంచి తెప్పిస్తుంది. అయితే ఆమె మీల్స్‌ కోసం శనివారం ఉదయాన్నే ఆర్డర్‌ పెట్టాలి. కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే ఆర్డర్‌ అందుబాటులో ఉంటుంది. 40 వరకు మీల్స్‌కు ఆర్డర్‌ తీసుకుంటుంది. తరువాత పని ప్రారంభిస్తుంది. ఆదివారం ఉదయం 11.30 గంటల వరకు మీల్స్‌ రెడీ చేస్తుంది. ముందు రోజు ఆర్డర్‌ చేసిన వారికి ఆ మీల్స్ ను ఆమె డెలివరీ చేస్తుంది. ఇక సోమవారం రోజు కూడా ఇలాగే ప్రత్యేక మీల్స్ ను చేస్తుంది.

మీనా అందించే ఒక్క మీల్స్‌ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. దాన్ని ఇద్దరు లేదా ముగ్గురు తినవచ్చు. ఒక్కో మీల్‌లో కొబ్బరితో తయారు చేసిన కర్రీ, పాపడాలు, ఊరగాయ, మజ్జిగ లేదా పెరుగు, అన్నం, సలాడ్‌, తీపి వంటకం, రసం, సాంబార్‌ వంటి పలు భిన్న వంటలు ఉంటాయి. ఇక ముందస్తు ఆర్డర్‌లు పెడితే కేవలం 30 నిమిషాల్లోనే ఆర్డర్స్‌ అయిపోతాయి. మళ్లీ ఇంకో రోజు వెయిట్‌ చేయాల్సిందే. ఆమె వండే వంటల్లో బిసీ బెలీ బాత్‌, అవియాల్‌, పాయసం, రసం వడ, చింతపండు ఇడ్లీ వంటివి ప్రధానమైనవి. తన తల్లి నుంచి వంటలను వండడం నేర్చుకున్నానని, తనను ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదని మీనా చెబుతోంది. ఏది ఏమైనా.. చేతిలో విద్య ఉంటే ఎక్కడైనా బతకవచ్చు.. అంటే ఇదేనేమో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version