సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం వింటూనే ఉంటాం.. కానీ ఆఫ్రికా లోని అతి పేద దేశం అయిన మాలిలో 25 ఏళ్ల మహిళ మంగళవారం మొరాకోలో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి ప్రభుత్వ ప్రకటన ప్రకారం, మొత్తం తొమ్మిది మంది పిల్లలు మరియు తల్లి ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారట. మొరాకో మరియు మాలిలో చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షల ప్రకారం హలీమా సిస్సేకి ఏడు శిశువులు ప్రసవిస్తారని భావించారు.
ఒకేసారి ఏడుగురు శిశువులకు జన్మనివ్వడం చాలా అరుదైన విషయం అనుకుంటే ఏకంగా తొమ్మిది మంది పిల్లలను ప్రసవించడం ఇంకా ఆసక్తికరంగా మారింది. తల్లి మరియు పిల్లలు ఇప్పటివరకు బాగానే ఉన్నారు ”అని మాలి ఆరోగ్య మంత్రి ఫాంటా సిబీ వార్తా సంస్థ ఎఎఫ్‌పికి చెప్పారు. సిస్సే ఐదుగురు బాలికలు మరియు నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చిందని, మొత్తం తొమ్మిది మంది పిల్లలను సిజేరియన్ ద్వారా ప్రసవించారని మాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.