ఒక బాటిల్ తాజా వైన్ రూపాయలు 75 కోట్లు… ఎందుకు అంత స్పెషల్ అంటే…?

-

ఈ వైన్ బాటిల్ కి ఎందుకంత ప్రత్యేకత అంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఒక సంవత్సరం పైగా ఈ వైన్ బాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. Petrus 2000 పంపించిన పన్నెండు బాటిల్స్ లో ఒక బాటిల్. ఇది 2019 నవంబర్ లో స్పేస్ స్టేషన్ కి వెళ్ళింది. అయితే ఇది 14 నెలల తర్వాత తిరిగి వచ్చింది. అయితే వైన్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం స్పేస్ లో జీరో గ్రావిటీ ఉంటుంది.

ఆ వాతావరణ ప్రత్యేకత కారణంగా ఈ బాటిల్ కి అంత ప్రత్యేకత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని కాంప్లెక్సిటీ సిల్కీ మరియు బ్లాక్ చెర్రీస్, సిగార్ బాక్స్ వీటన్నిటి రుచులు కూడా శాస్త్రీయ వింత గా మారింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలా రుచిగా ఉందట.

ప్రైవేట్ స్పేస్ స్టార్ట్ అప్ స్పేస్ కార్గో అన్లిమిటెడ్ నవంబర్ 2019 లో దీనిని పంపించారు. రీసెర్చర్లు కూడా దీనిని అర్థం చేసుకోవాలని దీని యొక్క వయసు, ఫర్మెంటేషన్ మరియు బబుల్ ఇలా ఇతర విషయాలు కనుక్కోవాలి అని అనుకున్నారు. అయితే భూమి మీదున్న వైన్ రుచి సాధారణంగా ఉంటే స్పేస్ లోకి వెళ్లి వచ్చిన వైన్ బాటిల్ సాఫ్ట్ గా మరియు సువాసనతో ఉంది అని చెప్పారు.

అయితే ఈ బాటిల్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు స్పేస్ కార్గో అన్లిమిటెడ్ భవిష్యత్తు రీసర్చ్ కి
ఫండ్ గా వెళ్తుందని చెప్పారు. అయితే స్పేస్ కి పంపిన పన్నెండు బాటిల్స్ లో కేవలం ఈ ఒక్క వాటిల్ ని మాత్రమే అమ్మారు.

ఇది ఇలా ఉంటే స్పేస్ నుండి వచ్చిన బాటిల్ ఈ భూమి మీద ఉండే బాటిల్ ని కంపేర్ చేసుకోవచ్చు అని వాళ్ళు అన్నారు. అయితే ఈ వైన్ కనీసం మరో రెండు లేదా మూడు దశాబ్దాలు వరకు ఉంటుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version