కేరళలో ఘోరం: మహిళపై గ్యాంగ్ రేప్

-

కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. గత వారం ఎర్నాకులం జిల్లా కొచ్చి నగరంలోని హోటల్‌లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి సమాచారం మేరకు సాలిన్ కుమార్(31)న పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు నిందితులు షామీర్, అజ్మల్‌గా గుర్తించారు. బాధిత మహిళ మల్లపుర్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 2న సాలిన్ కుమార్ ఆహ్వానించడంతో సదరు మహిళ హొటల్‌కు వెళ్లారు. అప్పటికే మరో ఇద్దరు ఆ గదిలో ఉన్నారు. నిందితులు తనతో శీతల పానీయాలు తాగించారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం గదిలో బంధించి తనను వీడియో తీశారని తెలిపింది. తనపై జరిగిన అత్యాచారం గురించి బయటకు చెబితే సోషల్ మీడియాలో వీడియో పెడుతామని బెదిరించారని ఆమె పేర్కొన్నది. బాధిత మహిళ మోడల్‌గా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version