దేశం లో జరుగుతన్న అవినీతి వల్లే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏ స్థాయి లో అవినీతి ఉన్నా.. సహించ వద్దని అన్నారు. దేశం లో అవినీతి చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే న్యాయం గా పని చేసే వారికి తప్ప కుండా ప్రొత్సహించాలని అని అన్నారు.
అలాగే అధికారులు.. ప్రజా ప్రతినిధులు ఉన్న అవినీతి కేసుల ను త్వరగా విచారణ జరపాలని అన్నారు. అంతే కాకుండా దోషులను తెల్చి కఠినం గా శిక్షించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థ లో యువ అధికారులు ఉంటే ఉత్సహం రెట్టింపు అవుతుందని అన్నారు. కాగ ఝూర్ఖండ్ మాజీ గవర్నర్ ప్రభాత్ కుమార్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణ సభ కు భారత రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు హజరు అయ్యారు. ఈ సందర్భం గా వెంకయ్య నాయుడు దేశం లో అవినీతి పరులు పై తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు.