ఇక మహిళల డ్రైవింగ్ కూడా నిషేధం.. తాలిబన్ల అరాచకం

-

ఆప్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న పైశాచిక నిర్ణయంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే బార్బర్ షాపులపై నిషేధాన్నివిధించిన తాలిబన్లు తాజాగా మహిళలు డ్రైవింగ్ ను కూడా నిశేధించారు. మహిళలు ఎవరూ డ్రైవింగ్ చేస్తే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతంల్ అమెరికన్ సపోర్ట్ తో వచ్చిన ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛను అనుభవించిన మహిళలకు తాజా తాలిబన్ నిర్ణయాలు కంటగింపుగా మారాయి. వారి హయాంలో మహిళలను డ్రైవింగ్ చేయడంతో పాటు స్వయంగా డ్రై వింగ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇవన్నీ నిషేధంలోకి రానున్నాయి. అధికారం చేపట్టిన మొదట్లో మహిళల స్వేచ్ఛకు ఎలాంటి భంగం రానీయమని హామీ ఇచ్చిన తాలిబన్లు వారి నిజ స్వరూపాలన్ని బయటపెడుతున్నారు. రోజుకో ఫత్వాతో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. అయితే గతంలోని తాలిబన్ ప్రభుత్వంలో మహిళలకు

Taliban

డ్రైవింగ్ కు అనుమతి ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఇప్పటికే మహిళలు ఒంటరిగా బయటకు రావద్దని, వచ్చినా కుటుంబ సభ్యులు వెంట ఉండాలని హెచ్చిరించారు. మహిళా టీచర్లు, డాక్టర్లు, ఇతర ఉద్యోగాలు చేసే మహిళలకు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version