Bigg Boss 5:  ఆ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి తక్కువోడేం కాదు.. శ్వేతతో రొమాన్స్ చేసే అవ‌కాశ‌మివ్వ‌మంటూ రిక్వెస్ట్

-

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్ష‌కులు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న షో బిగ్ బాస్. ఫ‌న్నీ టాస్కులు, అరుపులు, గొడవలు, ఏడుపులు, ఫైటింగులు, రొమాన్స్, ల‌వ్ సోర్టీలు ఇలా ఎన్నో రకాలుగా చూపిస్తూ.. విజ‌యవంతంగా దూసుక‌పోతుంది. అయితే సోమ‌వారం నామినేష‌న్ల ప‌ర్వంతో హీట్ ఏక్కినా ఈ షో.. కంటెస్టెంట్ల‌ ఫ‌న్నీ చేష్టాలు, స‌ర‌దా క‌బుర్ల‌తో కాస్త కూల్ అయ్యింది.

ఈ వారం కెప్టెన్ జెస్సీ.. మిగతా కంటెస్టెంట్ల కంటే జేస్సీ వేరు. ఇత‌డు అందరికి కంటే చిన్నోడు కావడం, అమాయ‌కంగా ఉండ‌టం, సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ష‌న్ను చెప్పింది చేయ‌డం ఇవ‌న్నీ అత‌డి బ‌ల‌హీన‌త‌లు. ఈ విష‌యంలో ప‌లుమార్లు హోస్ట్ కింగ్ నాగ్ కూడా జెస్సీకి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో.. అని సలహా కూడా ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. అమ్మాయిల విష‌యంతో మ‌నోడు త‌క్కువేమికాదు. మంచి పులిహోర రాజానే .. చాన్స్ దొరికితే చాలు.. ఫ్ల‌టింగ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పటికే .. సిరి, హమిదా ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేశాడు. తాజా నిన్న జ‌రిగినా షోలో శ్వేత ను ఫ్లటింగ్‌ చేయడానికి ట్రై చేస్తాడు. శ్వేతను తన గర్ల్ ఫ్రెండ్ చేసి ఓ టాస్క్ ఫ్లాన్ చేయ‌మ‌ని ఏకంగా బిగ్‌బాస్‌కే రిక్వెట్ పెట్టుకున్నాడు.

బిగ్‌బాస్‌.. శ్వేత‌ను న‌న్ను కలిపేలా ఓ ట్కాస్ ఇవ్వండి. అందులో నా గర్ల్‌ఫ్రెండ్‌గా శ్వేత‌కు ఓ రోల్‌ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్‌ సాంగ్‌ ప్లే చేయండి. ఆ సాంగ్ మీద మేమిద్ద‌రం క‌లిసి స్టెప్పులు వేస్తుంటే మిగితా వాళ్లు షాక్ కావాలి. అలా ఓ ట్కాస్ ఇవ్వండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది.

అమాయ‌కంగా ఉండే జెస్సీలో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏంట్రా బాబు అని అంతా షాక్‌ అవుతున్నారు. ఓ టాస్క్ లో భాగంగా జుట్టు కత్తిరించుకున్నాడు జెస్సీ. మరి ఈ అమాయకపు చక్రవర్తి కోరికను బిగ్‌బాస్‌
తీరుస్తాడో లేదో వేచి చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version