మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని జాగృతి అద్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్‌ను జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయట్లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు అమలు కానందువలన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో అతివలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు.జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు పెట్టలేదని ప్రశ్నించారు.జనగణన త్వరగా కంప్లీట్ చేస్తే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు.