ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ను తెలంగాణ రాష్ట్రానికి రెండో అతి పెద్ద రాజధానిగా చేయాలని సీఎం రేవంత్ చూస్తున్నారని వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఒక లెవల్‌లో వరంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని వివరించారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.ఇదిలాఉండగా, ఇప్పటికే వరంగల్ జిల్లాలోని మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు కేందప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై అధికారుల సర్వే కొనసాగుతోంది.