మన ఊర్లలో ఏదైనా గొడవ అయితే.. ఆడవాళ్లు జుట్లు పట్టేసుకుని కొట్టుకుంటారు. మీరు చూసే ఉంటారు… పంపుల దగ్గర అయితే బిందెలతో పిచ్చకొట్టుడు కొట్టుకుంటారు..కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ ఆవేశంలో.. దొరికింది తీసుకుని రెండు తంతే కానీ.. మన కోపం చల్లారిపోతుంది. కానీ దాని వల్ల గాయాలు అవడం.. ఆసుపత్రి పాలవడం ఇవన్నీ జరుగుతాయి.. కానీ ఈ ఫైట్ చూస్తే..మీరు ఆశ్చర్యపోతారు.. మహిళలు పిచ్చ కోపంలో ఉన్నారు. కర్రలు పట్టుకున్నారు.. కొడుతున్నారు.. కానీ మనుషులను కాదు.. రోడ్డును.. అర్థంకాలేదా.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ మాత్రమే ఒక సైడ్ ఉంది.. ఇంకొంత మంది మహిళలు వేరే సైడ్ ఉన్నారు. అందరూ కర్రలు తీసుకుని రోడ్డును కొడుతున్నారు. వాళ్ల భాషలో తిట్టుకుంటున్నట్లు ఉన్నారు. అంటే వాళ్ల మీద కోపాన్ని అంతా.. ఇలా నేలను కొడుతూ తిట్టుకుంటున్నారు. ఇది జార్ఘాండీ గ్రామం.. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లా జామువా సబ్ డివిజన్‌లో ఉంది ఈ గ్రామం. ఇక్కడి మహిళలు ఇలా కొట్టుకోవడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా.. ఇలా కూడా కోపాన్ని తీర్చుకోవచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే.. సోషల్ డిస్టెన్స్ ఫైట్ అని నవ్వుతున్నారు. ఎకో ఫ్రెండ్లీ ఫైట్ అని, ఇది మూడో ప్రపంచం యుద్ధంలా ఉందని ఇలా ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోకు ఇప్పటికే.. 888k లైక్ వచ్చాయి.. 17.7k కమెంట్ వచ్చాయి.. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ రేంజ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పద్ధతి ఏదో బాగుంది.. మన దగ్గర ఆడవాళ్లు కూడా ఇలాంటి టెక్నిక్ ఫాలో అయితే.. బాగుంటుది కదా.. చిన్నదానికిపెద్దానికి.. మన సైడ్ కోపంతో ఎదుటివారి మీద దాడికి దిగుతారు.. దానివల్ల..వారి మధ్య దూరం పెరిగిపోతుంది. ఇంకా.. గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.. ఇది అయితే కోపం తగ్గే వరకూ ఇలాచేసి సైలెంట్ అవ్వొచ్చు.. మీరు కూడా చూడండి..!
https://www.instagram.com/reel/CpOs-yMPIkb/?igshid=YmMyMTA2M2Y=