హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు మొత్తం 91 రోజులపాటు బట్టి పాదయాత్ర కొనసాగునుంది. అయితే బట్టి పాదయాత్ర పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. భట్టి మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని అన్నారు.
గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం మాకు ఉందన్నారు కోమటిరెడ్డి. పూర్తిగా పాదయాత్ర పెట్టుకున్నావ్ జాగ్రత్తగా నడవండి అని భట్టికి సలహా ఇచ్చానన్నారు కోమటిరెడ్డి. పెద్ద సెంటర్ లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానన్నారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం అన్నారు.
అలాగే నల్గొండలో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరానన్నారు. వారు కూడా ఒప్పుకున్నారని.. తర్వాత నకిరేకల్, సూర్యాపేట లలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానన్నారు. ఈ పాదయాత్ర ముగింపు సభకు రాహుల్ గాంధీ, లేదా ప్రియాంక గాంధీ ని పిలుస్తారా అనేది వారి ఇష్టం అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆదివారం తాను తప్పకుండా పాదయాత్ర లో పాల్గొంటానని తెలిపారు కోమటిరెడ్డి.