అక్కడ మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు : ఎన్ఎఫ్ హెచ్ఎస్ సర్వేలో వెల్లడి

-

దేశంలోని మహిళల, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించి విడుదలైన ఓ సర్వే కీలక విషయాలను బయటపెట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది.

2019-21 కాలానికి గానూ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌లో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వే పేర్కొంటోంది.

రాజస్థాన్‌లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండటం గమనార్హం. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5 మందితో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది.

దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లోని 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా.. మహిళల కంటే పురుషులే అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. అదే విధంగా, గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా.. వారి జీవితకాలంలో సెక్స్‌ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version