వివాహేతర సంబంధాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. అక్రమం సంబంధం చివరికి చీకటి జీవితాలను మిగిల్చుతున్నాయి. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటానని అతను ఊహించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతను పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు అతని భార్యతో సంతోషంగా జీవించాడు. తరువాత ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లాడు. ప్రతిరోజూ భార్య దుబాయ్ లో ఉంటున్న భర్తతో ఫోన్ లో మాట్లాడుతోంది. ప్రతి సంవత్సరం ఒకటి రెండుసార్లు భర్త సొంతఊరికి వెళ్లి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇదే సమయంలో దుబాయ్ లో ఉన్న భర్త కళ్లుకప్పిన భార్య సొంత ఊర్లో ఉంటున్న తనకంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.
దుబాయ్ లో ఉంటున్న భర్తకు అతని భార్య వ్యవహారం తెలీలేదు. భర్త కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఆమెను మందలించారు. ఎవరు ఎన్ని చెప్పినా భార్య మాత్రం పట్టించుకోలేదు. అసలు మ్యాటర్ తెలుసుకున్న భర్త దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చి భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య మాత్రం ఆమె పద్దతి మార్చుకోకుండా ఇంకా రెచ్చిపోయింది. పరువు పోయిందని అనుకున్న భర్త అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.