ఇంట్లో వంట చేయడం ఎంత ముఖ్యమో పాత్రలు శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. కానీ ‘మహిళలు అంట్లు తోమకూడదు’ అనే ఒక విచిత్రమైన మాట తరచుగా వినిపిస్తుంది. ఇది కేవలం పురాతన ఆచారమా? లేక దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక లేదా వాస్తు రహస్యం దాగి ఉందా? ఈ అంశంపై నెలకొన్న నమ్మకాలు వాటి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు, ఆధ్యాత్మిక దృష్టిలో కారణాలు: హిందూ ధర్మం, వాస్తు శాస్త్రాల ప్రకారం మహిళలు అంట్లు తోమకూడదు అనే నియమం కచ్చితంగా లేకపోయినా, కొన్ని నిర్దిష్ట సమయాల్లో పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదనే నమ్మకం ఉంది. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు చెబుతారు.
లక్ష్మీదేవి ఆగ్రహం: రాత్రి భోజనం పూర్తయ్యాక మురికి పాత్రలను సింక్లో వదిలివేస్తే అది లక్ష్మీదేవి ఆగ్రహానికి దారితీస్తుందని ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కొందరి విశ్వాసం. కాబట్టి మురికి పాత్రలు లేకుండా చూడటం ప్రధాన లక్ష్యం.

నిజమైన ఉద్దేశం: శుభ్రత, సమృద్ధి, పాత్రలు కడగడం మహిళకు మాత్రమే చెందిన పని అని చెప్పడం కంటే ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవడం ఈ నమ్మకం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం. పాత రోజుల్లో ఇంటి యజమానురాలు శుభ్రతను పర్యవేక్షించేది. మురికి పాత్రలు ఉండటం అంటే నిర్లక్ష్యం లేదా నెగటివ్ ఎనర్జీకి సంకేతం. అందుకే రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసి, ఆ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఈ పనిని ఎవరు చేసినా, ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో, సమృద్ధిగా ఉంటుందనేది అసలు భావన.
మార్పు, అవగాహన ముఖ్యం: ఈ ఆధునిక యుగంలో, ఇదొక లింగ వివక్షకు సంబంధించిన పనిగా చూడకుండా ఇంట్లోని ప్రతి ఒక్కరూ మురికి పాత్రలను వెంటనే శుభ్రం చేయడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. శుభ్రత, ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఏ పని ఎవరు చేసినా ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని అర్థం చేసుకోవాలి.
