ప్రియుడి తో గొడవ జరిగిన తరవాత ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దాంతో ప్రియుడే హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటక లోని శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ సర్కిల్ లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. వివహితకు భర్త ఇద్దరు సంతానం ఉన్నారు.
ఆమె భర్త కూలి పనులు చేస్తూ కుటుంబం ను పోషిస్తుండగా రాజేశ్వరి పిల్లల ఆలనా పాలనా చుస్కుంటు ఇంట్లోనే ఉంటుంది. అయితే రాజేశ్వరికి గత నాలుగేళ్లుగా స్థానిక ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ తో వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తన భార్య ను అరుణ్ కుమర్ ఏ హతమార్చాడు అని ఆరోపిస్తున్నారు. దాంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.b