సంచలనం; ఒక రోజు కలెక్టర్ అయిన బాలిక…!

-

ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ని చూసారు కదా…? ఒక రోజు ముఖ్యమంత్రిగా చేసి పాలన మొత్తం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. సరిగా ఒక బాలిక ఒక రోజు కలెక్టర్ అవుతుంది. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళా దినోత్సవం అనేది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను జరుపుకునే రోజు.

అలాగే మహిళల హక్కుల సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఉంటారు. చారిత్రాత్మకంగా చూస్తే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఉత్తర అమెరికాలో మరియు ఐరోపా అంతటా ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల నుంచి మొదలయింది. కొన్ని దేశాలు మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంతో జరుపుకుంటాయి. మరికొన్ని దేశాలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి.

మహారాష్ట్రలో అలాంటి ఒక కార్యక్రమం జరుగుతోంది, ఇక్కడ ఒక పాఠశాల విద్యార్థిని ఒక రోజు కలెక్టర్‌గా నియమించారు. బుల్ధానా జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర పోస్ట్ ప్రకారం చూస్తే జిల్లా పరిషత్ పాఠశాల పూనమ్ దేశ్ ముఖ్ ఒక రోజు కలెక్టర్ గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, కొద్దిమంది అమ్మాయిలకు ఒక రోజు కలెక్టర్లుగా వ్యవహరించే అవకాశం లభిస్తుందని ఎంఎస్ చంద్ర ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.

“అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడానికి, ఒక వారం పాటు ప్రతిభావంతులైన అమ్మాయిలలో కొంతమందికి ఒక రోజు కలెక్టర్‌గా ఉండటానికి అవకాశం ఇవ్వబడుతుంది” అని ఆమె ట్వీట్ చేసారు. “నేటి కలెక్టర్ జిల్లా పరిషత్ స్కూల్ స్టార్ పూనమ్ దేశ్ ముఖ్,” అని Ms చంద్ర తన డెస్క్ వద్ద పనిచేసే పూనమ్ చిత్రాన్ని పోస్ట్ చేసారు. ఆమె ట్వీట్ వైరల్ అయ్యింది, 2 వేలకు పైగా ‘లైక్స్’ మరియు మంచి కామెంట్స్ సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version