అన్న పై అలిగిన షర్మిల..?

-

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల విషయంలో అధికార వైసీపీ తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. ఎవరిని రాజ్యసభకు పంపించాలి అనే దానిపై జగన్ ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చలు కూడా జరిపారు. ముఖ్యమంత్రి జగన్ మీద చాలా మంది నేతలు రాజ్యసభ సీటు విషయంలో ఆశలుపెట్టుకున్నారు. పార్టీకి భారీగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టి సీట్లు రాని వాళ్ళు ఉన్నారు.

అలాగే అయోధ్యరామి రెడ్డి, వైఎస్ షర్మిల, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు సహా పలువురు నేతలు రాజ్యసభ సీటు విషయంలో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే సినీ నటుడు చిరంజీవి కూడా రాజ్యసభ సీటు విషయంలో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు జగన్ హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే ఆయన సోదరి షర్మిల కూడా రాజ్యసభ సీటు విషయంలో అవకాశం కోసం చూస్తున్నారు.

ఆమెకు జగన్ హామీ ఇచ్చారని కొందరు ఇవ్వలేదని మరికొందరు చెప్తున్నారు. పార్టీ కోసం జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె ఎంతగానో కష్టపడ్డారు. కాని ఆమెకు ఇప్పటి వరకు ఏ పదవి కూడా జగన్ నుంచి దక్కలేదు. పార్టీ మొన్నటి వరకు విపక్షంలో ఉండటం తో అవకాశం కోసం ఎదురు చూసారు. ఇప్పుడు రాజ్యసభలో బలం పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో తాను పార్లమెంట్ కి వెళ్ళాలి అని చూస్తున్నారు.

దీనిపై మరి జగన్ ఏ హామీ ఇస్తారో తెలియదు గాని ఆమె మాత్రం తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. కాని జగన్ మాత్రం ఎన్డియే కి రెండు సీట్లు ఇవ్వాలని చెప్పారట. అందులో ఒకటి అంబాని సూచించిన పరిమల్ నత్వానికి అని తెలుస్తుంది. దీనితో షర్మిల అసహనంగా ఉన్నారట. పార్టీలో అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి అందరూ కుటుంబంలో పదవులు తీసుకున్నారని, తనకే ఏ దిక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version