డబ్బులు ఇవ్వు లేకుంటే రేప్‌ చేశావని కంప్లెట్‌ చేస్తా.. రోడ్డుపై మహిళల దందా..

-

సమాజంలో స్త్రీలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలను కట్టడి చేసేందకు చట్టాలను తీసుకువస్తే.. వాటిని కొందరు స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారు. స్త్రీలకు అనుగుణంగా చట్టాలు ఉన్నాయని.. అమాయకపు ప్రజలపై లేనిపోని.. నిందలు వేసి డబ్బులు గుంజుతున్నారు. గుంటూరు జిల్లాలో ఓ మహిళల ముఠా రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే.. రేప్‌ చేశావని ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఒక యువకుడు ఫిర్యాదులో ఈ ముఠా గుట్టు రట్టాయింది.

గుంటూరు జిల్లాలో వాహనదారుల నుంచి డబ్బు గుంజుతున్న మహిళల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే తదితర ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు 45 బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్‌లోని దుర్గానగర్ కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. తమది గుజరాత్ అని… ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ కరపత్రాలు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాహనదారుల నుంచి వాహనాల తాళాలు లాక్కొన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గుంటూరుకు చెందిన సాయితేజ రెడ్డి అనే వాహనదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో సదరు యువతులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version