జన్‌ధన్‌ యోజన అకౌంట్ ఉందా? అయితే రూ.10 వేలు మీ సొంతం..

-

దేశ ప్రజల అభివృద్ధి కోసం మోడీ సర్కారు కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలను,స్కీమ్ లను అమల్లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా అమ్మాయిల రక్షణ, భవిష్యత్‌ కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ లు అన్నిటికీ జనాల నుంచి మంచి స్పందన లభించింది..ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ పథకాల్లో ఒకటి ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం.

ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చింది.. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్‌ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు జన్‌ ధన్‌ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్‌ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు. అంతేకాదు ఈ పథకం వల్ల మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు.ఈ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇకపోతే రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ డెబిట్‌ కార్డుద్వారా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. కొనుగోళ్లు కూడా నిర్వహించవచ్చు. ఈ జన్ ధన్ యోజన కింద10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు.పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ATM కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు. మీరు దీనిపై 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ ఏదో ఒకటి ఉండాలి.

మీకు ఈ పత్రాలు లేకపోతే మీరు చిన్న ఖాతాను కూడా ఓపెన్ చేసే సౌకర్యం ఉంది. ఇందులో మీరు బ్యాంకు అధికారి ముందు ఒక ఫోటో, ఫారమ్‌ నింపి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం గతంలో రూ.5000 ఉండగా, దానిని కేంద్ర ప్రభుత్వం రూ.10,000 పెంచింది..ఇండియాలో వాళ్ళు ఎవరైనా ఈ ఖాతాను తెరవచ్చు..ఈ ఖాతాను తెరచిన ఆరు నెలలకు ఓవర్ డ్రాఫ్ట్ డబ్బులను డ్రా చేసుకొనే సదుపాయం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version