ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. కరోనా సమయం నుంచి కూడా చాలా మంది ఇళ్లలోనే ఉండి వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని కనుక మీరు పాటిస్తే వర్క్ ఈజీగా ఉంటుంది.
ప్లాన్ ప్రకారం పని చేయండి:
మీరు ముందు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ప్లాన్ చేసుకుని వర్క్ చేయడం వల్ల మీరు సరిగ్గా, సక్రమంగా పని చేయడానికి వీలవుతుంది. అలానే అవసరమైనా సామాన్లు దగ్గర ఉంచుకోండి. పెన్, ముఖ్యమైన నోట్స్ ఇటువంటివన్నీ పక్కన ఉంచుకోండి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే ముందు వాళ్ళ పని చూసి ఆ తరువాత మీరు పని చూసుకోవడం మంచిది.
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం:
మీరు మీ టీం తో, మీ మేనేజర్ తో ముందుగానే మాట్లాడుకోవడం ముఖ్యం. మీకు అవసరమైన వాటిని అన్ని ముందు డిస్కస్ చేసుకోండి. ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం వస్తే క్లియర్ గా ఉంటుంది. సరైన సమాచారం లేకపోతే పనిలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
గందరగోళానికి దూరంగా ఉండండి:
ఇంట్లో పని చేయడం నిజంగా కష్టం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా అరిచినా, గోల చేసిన ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు వీటన్నిటికి దూరంగా వచ్చేయాలి. ముందుగానే మీకు కావలసిన అన్నిటినీ మీ రూమ్ లోకి తెచ్చుకుని పెట్టుకోండి.
ప్రొడక్టివ్ గా ఉండండి:
మీరు పని చేస్తున్నప్పుడు ఎంత ప్రొడక్ట్ గా ఉంటే అంత మంచిది. మీరు వెనకాల పాటలు పెట్టుకుని కూడా పని చేయొచ్చు. ఇది మీ ఫోకస్ ని మరింత పెంచుతుంది. అలానే కఠినంగా ఉన్న పనుల్ని ఉదయాన్నే చేయండి. ఉదయాన్నే ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.
మీ వర్క్ ప్లేస్ పై దృష్టి పెట్టండి:
మీరు వేరేగా ఒక రూమ్ లో కూర్చుని పని చేయడం మంచిది. టీవీ ముందు లేకపోతే మనుషుల మధ్య కూర్చుని వర్క్ చేస్తే ఫోకస్ తగ్గుతుంది. కనుక మీరు వీటన్నిటి పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.